Monday, January 20, 2025

మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. 19 మంది పాలస్తీనియన్లు మృతి

- Advertisement -
- Advertisement -

గాజా, హమాస్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. భీకర దాడులు చేసింది. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా గాజాలోని జబాలియా ప్రాంతంలోని ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. దీంతో పలు భవనాలు నేల మట్టమయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమయ్యాయి.ఈ దాడుల్లో దాదాపు 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో వేలాది మంది శిథిలాల కింద చిక్కుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు తెలిపారు. తమ పౌర స్థావరాలపై ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడులను హమాస్‌ తీవ్రంగా ఖండించింది. కాగా, ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 42 వేల పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News