Sunday, December 22, 2024

భారీ వర్షాలకు యూపీలో 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రమాదాల్లో మొత్తం 19 మంది మృతి చెందారు. నలుగురు పిడుగులు పడి , ఇద్దరు వరదలో మునిగి చనిపోయారు. హర్‌దోయిలో నలుగురు, బరబంకిలో ముగ్గురు, ప్రతాప్‌గఢ్, కన్నౌజీలలో ఇద్దరేసి వంతున, అమేథీ, డియోరియా, జలౌను, కాన్పూర్, ఉన్నావో, సంభాల్, రాంపూర్, ముజఫర్ నగర్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు వంతున ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర పునరావాస కమిషనర్ కార్యాలయం సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఆదివారం నుంచి ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యంగా రాష్ట్రం మధ్య ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజాజీవనం స్తంభించిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News