Friday, November 15, 2024

ఇవిఎంల కొనుగోళ్లకు రూ 1,900 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఇవిఎంల కొనుగోళ్ల కోసం దాదాపుగా రూ 1,900 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులను కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వశాఖకు కల్పించారు. ఈ ఏడాది పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సంఘం ఓట్ల ప్రక్రియకు వాడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం) సమకూర్చుకునేందుకు ఈ మొత్తం దోహదపడుతుంది.

బ్యాలెట్ యూనిట్లు, కంట్రోలు యూనిట్స్, ఓటరు వెరిఫైబుల్ పేపర్ ఆడిట్‌ట్రయల్ యూనిట్స్ , ఇవిఎంలకు అనుబంధ వ్యయానికి సంబంధించి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. ఇప్పటికే తమ కాలపరిమితి ముగిసిన ఇవిఎంలు, దెబ్బతిన్న ఇవిఎంలను తీసివేసి కొత్తవి సమకూర్చేందుకు ఈ కేటాయింపులు ఉపయోగపడుతాయి. 2004 నుంచి కూడా లోక్‌సభ ఎన్నికలకు , 139 అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఇవిఎంలను వాడుతూ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News