Saturday, December 21, 2024

7 రాష్ట్రాల్లో 10 శాతం దాటిన పాజిటివిటీ రేటు

- Advertisement -
- Advertisement -

19406 covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో ఏడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం దాటడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తం అయింది. వైరస్ కట్టడికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటూ ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం దాటింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ఆ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. వైరస్ వ్యాప్తి కట్టడికి ఐదంచెల వ్యూహాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, అర్హులందరికీ వ్యాక్సినేషన్ అందించాలని, కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించేలా చూడాలని లేఖల్లో సూచించారు. రాబోయేవి పండగ రోజులు కావడంతో సామూహిక కార్యక్రమాలు జరుగుతాయని, దీంతో కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదముందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

కొత్త కేసులు , రికవరీలు 19 వేలే…
తాజాగా 3.91 లక్షల మందికి వైద్యపరీక్షలు చేయగా 19,406 మందికి వైరస్ బయటపడింది. 49 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 4.96 శాతానికి చేరిందని కేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఢిల్లీలో 2419 మంది వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,928 మంది కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.34 లక్షలకు చేరుకున్నాయి. క్రియాశీల రేటు 0.31 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. శుక్రవారం 32.7 లక్షల మంది టీకా తీసుకోగా ఇప్పటివరకు 205 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News