Saturday, November 23, 2024

పవిత్ర హజ్‌కు బయలుదేరిన 1,950 మంది యాత్రికులు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : నాంపల్లి హజ్ హౌస్ హజ్ శిబిరం నుంచి పలు రాష్ట్రాల ముస్లీం యాత్రికుల పవిత్ర హజ్‌కు బయలుదేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సందర్బంగా హజీలతో ఆధ్యాత్మిక వాతారణం నెలకొన్నది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు వీరికి వీడ్కోలు పలికేందుకు రావడం సందడిగా మారింది. ముస్లీంలు హజ్ యాత్రను అత్యంత పవిత్రంగా భావిస్తారు. నెల రోజుల పాటు పవిత్ర యాత్రలో మమేకమవుతారు. తమ జీవితంలో ఒక్కసారైన అక్కడికి వెళ్లలన్నదే వారి లక్షం… ఈ నేపద్యంలో వీరి సౌకర్యార్ధం కేంద్ర, రాష్ట్ర వివిధ శాఖలు దగ్గరుండి 24 గంటలపాటు మెరుగైన సేవలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు హజ్ హౌస్ నుంచి 1,950 మంది యాత్రికులు జెడ్డా నగరానికి చేరుకున్నారు.

మిగిలిన యాత్రికులను ఇక్కడి నుంచి దశలవారీగా ప్రత్యేక బస్‌లలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నారు. నిత్యం మూడు విమానాల్లో 150 మంది చొప్పున ఎయిర్‌పోర్టుకు పంపిస్తున్నారు. ఈమేరకు యాత్రీకుల బస్‌ను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలి జెండా ఊపి శ్రీకారం చుట్టి యాత్రీకులకు వీడ్కోలు పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి మొత్తం 6,900 మంది యాత్రికులు దశలవారీగా పవిత్ర స్థలికి వెళుతున్నారు. తెలంగాణ కోటా ప్ర కారం 6,552 మంది లక్కీ డ్రా ద్వారా ఏంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 38 మంది, కర్నాటకలో పలు జిల్లాల నుంచి 1200, మహారాష్ట్ర 400 మంది యాత్రీకులు బయలుదేరనున్నారు.

వీరిని ప్రతి రోజూ మూడు విమానాల్లో 450 మందిని ఎయిర్‌పోర్టుకి పంపిస్తున్నారు. గతంలో వీవీఐపీల కోటాను కేంద్రం రద్దుచేసింది. దీంతో మిగతా యాత్రికులకు ఎంతో వెసులుబాటు క ల్గింది. యాత్రీకులకు తెలంగాణ హజ్ కమిటీ ఉచిత బస, భోజనాలు, ఫలహారాలు సమకూరుస్తోంది. యాత్రీకుల సేవల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశా రు. విదేశీ మారక ద్రవ్యం మార్పిడి చేసుకునేందుకు వెసులబాటు కల్పించా రు. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ సిబ్బంది యాత్రీకుల సేవల్లో నిమగ్నమయ్యారు. నె ల రోజులపైగా యాత్ర ముగించుకుని యాత్రికులు తిరిగి వచ్చే జూలై 14 నుంచి నగరానికి చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News