Sunday, December 22, 2024

హిమాచల్‌ను వదలని భారీ వర్షాలు.. 197 రోడ్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో క్రితం వారం భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల రెండు జాతీయ రహదారులతో సహా 197 రోడ్లను మూసివేసినట్లు అధికారులు సోమవారం తెలియజేశారు. ఉనాలో పలు ప్రాంతాలు జలార్ణవంగా మారాయని, చంబా, మండి, కిన్నౌర్, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని వారు తెలిపారు.

జూన్ 27, సోమవారం (12) మధ్య వర్ష ప్రభావిత సంఘటనల్లో కనీసం 110 మంది వ్యక్తులు మరణించారని, రాష్ట్రానికి దాదాపు రూ. 1004 కోట్ల మేరకే నష్టాలు సంభవించాయని వారు తెలియజేశారు. సిమ్లా జిల్లాలో 66, సిర్మౌర్‌లో 58, మండిలో 33, కులూలో 26, కిన్నౌర్, లాహౌల్ స్పితిలో ఐదు వంతున, కాంగ్రా జిల్లాలో నాలుగు రోడ్లను మూసివేసినట్లు రాష్ట్ర ఆత్యయిక నిర్వహణ కేంద్రం(ఎస్‌ఇఒసి) తెలిపింది. సోమవారం 221 విద్యుత్, 143 నీటి సరఫరా పథకాలకు అంతరాయం వాటిల్లినట్లు ఆ కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News