Saturday, November 16, 2024

1971 భారత్‌-పాక్ యుద్ధవీరుడు కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన 1971నాటి యుద్ధంలో దాయాది పాక్‌పై వీరోచితంగా పోరాడిన బిఎస్‌ఎఫ్ హీరో భైరోన్‌సింగ్ షెకావత్ రాథోడ్ సోమవారం కన్నుమూశారు. రాజస్థాన్‌లోని పోస్టులో పాక్ బలగాలపై షెకావత్ పోరాడి బిఎస్‌ఎఫ్ హీరోగా గుర్తింపు పొందారు. 81ఏళ్ల రాథోడ్ సోమవారం జోథ్‌పూర్‌లో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. భైరోన్‌సింగ్ జోథ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో సోమవారం తుదిశ్వాస విడిచారని బిఎస్‌ఎఫ్ డిజి ట్విట్టర్ వేదికగా తెలిపారు. విధినిర్వహణలో నాయక్ అసమాన సాహసం, ధైర్యం, త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్లు బిఎస్‌ఎఫ్ ట్వీట్ చేసింది. రాథోడ్ కుమారుడు మీడియాతో మాట్లాడుతూ ఇండో పాక్ యుద్ధం 51వ వార్షికోత్సవం రెండు రోజుల ముందు ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 14న తమ తండ్రి జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో చేరారని తెలిపారు.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనపడటంతో వైద్యులు ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారని సింగ్ వివరించారు. జోధ్‌పూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో రాథోడ్ కుటుంబం నివసిస్తుంది. ఈ సందర్భంగా బిఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి భైరోన్‌సింగ్ పార్థివదేహానికి బిఎస్‌ఎఫ్ శిక్షణ కేంద్రంలో నివాళి అర్పించిన అనంతరం పూర్తి లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని తెలిపారు. యుద్ధంలో లాన్స్‌నాయక్ హోదాలో ఉన్న రాథోడ్ మృత్యువుకు భయపడకుండా శత్రు దళాన్ని మట్టికరిపించారు. రాథోడ్ ధైర్యసాహాసాల గుర్తింపుగా ప్రభుత్వం 1972లో సేన పతకంతో గౌరవించింది. 1987లో ఆయన సర్వీస్ నుంచి నాయక్‌గా రిటైరయ్యారు. కాగా1997లో నిర్మించిన బాలీవుడ్ చిత్రం బోర్డర్ సినిమాలో సునీల్‌శెట్టి పాత్రను పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News