Saturday, December 21, 2024

దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1362 New Corona Cases Reported in Telangana

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నాలుగు లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 19,893 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 53 మంది చనిపోయారు.  దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.4 కోట్లకు చేరుకోగా 5.26 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 4.33 కోట్ల మంది కోలుకోగా 1.37 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 205.22 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరో వైపు మంకీపాక్స్ అందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో తొమ్మిది మందికి మంకీపాక్స్ సోకినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంకీపాక్స్ తో ఒకరు మృత్యువాతపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News