న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి లోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అదుపు లోనే ఉండటంతోపాటు రికవరీలు కూడా పెరుగుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేయగా, 19,893 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉంది. 20.419 వరకు రికవరీలు కాగా, మొత్తం రికవరీలు 4.34 కోట్లు వరకు ఉన్నాయి. రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసులు 1,36,478 వరకు ఉండగా, వీటి రేటు 0.31 శాతంగా నమోదైంది. 24 గంటల్లో 53 మంది మరణించగా, మొత్తం మరణాలు 5.26 వరకు ఉన్నాయి. బుధవారం 38.20 లక్షల డోసులు పంపిణీ కాగా, ఇప్పటివరకు మొత్తం 205.22 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. మరో వైపు మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 9 మంది మంకీపాక్స్ బారిన పడగా, ఓ మరణం చోటు చేసుకుంది.
కట్టడి లోనే కరోనా ఉద్ధృతి… పెరుగుతున్న రికవరీలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -