- Advertisement -
న్యూఢిల్లీ : లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ లోని ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1993 లో దేశంలో జరిగిన వరుసరైలు బాంబు పేలుళ్ల కేసులో ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేవని పేర్కొంది. 1993లో నాలుగు రైళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసులో తుండాతోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. ఇదిలా ఉంటే 1996 బాంబు పేలుళ్ల కేసులో ప్రస్తుతం తుండా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. పలు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
- Advertisement -