Saturday, December 21, 2024

19న తెలంగాణ హరితోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 19 సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం జరగనుందని, విస్తృతంగా పర్యావరణ హిత కార్యక్రమాలు, హరితహారం విజయాల ప్రదర్శన అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తామని, ఉదయం తుమ్మలూరులో మొక్కలు నాటే కార్యక్రమం, తొమ్మిదేళ్ల హారితహారం ఫలితాల ప్రదర్శన ఉంటుందన్నారు. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. శనివారం ఈ మేరకు అన్ని జిల్లాల అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కాగా అదే రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో హరితోత్సవం కార్యక్రమం ఉంటుందని, సాంస్కృతిక కార్యక్రమాలు, అటవీ రక్షణ, హరితహారంలో పచ్చదనం పెంపుకు కృషి చేసిన ప్రజాప్రతిధులు, అధికారులు, సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హరితోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని పీసీసీఎఫ్ డోబ్రియాల్ కోరారు. ప్రతీ గ్రామ స్థాయి నుంచి, మండలం, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులకు తెలిపారు. వర్షాలకు దృష్టిలో పెట్టుకొని సరైన నీటి వసతి ఉన్న భూముల్లో మాత్రమే మొక్కలు నాటాలని, రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాత తొమ్మిదో విడత హరితహారాన్ని ముమ్మరం చేయాలని కోరారు.

హరితోత్సవం రోజున హరితహారం విజయాలను అన్ని చోట్లా ప్రచారం చేయాలని, ప్రజల్లో మరింతగా పర్యావరణ స్పృహ పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాష్ట్ర మంతటా పరుచుకున్న పచ్చదనం, ప్రతీ గ్రామంలో వెలిసిన నర్సరీలు, ప్రకృతి వనాలు, రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అటవీ పునరుద్ధరణ ఫలాలను ప్రతీ ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఇవే విజయాలను పోస్టర్లు, వీడియోల ద్వారా ప్రదర్శించాలని తెలిపారు. పర్యావరణ స్పృహ పెరిగేలా అయా ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. గ్రామాలు, మండలాల్లో కొత్తగా మొక్కలు నాటే ప్రాంతాలకు దశాబ్ది వనాలుగా పేరు పెట్టాలని సూచించారు. 19 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మొక్కల నాటే కార్యక్రమం కోసం పెద్ద మొక్కలు, ప్లాంట్ మెటీరియల్ సిద్దం చేయాలని, అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News