- Advertisement -
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూపు హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఆ రెండు దేశాల్లో చిక్కుకున్న భారతీయులుతోపాటు , స్వదేశానికి రావాలని అనుకుంటున్నవారిని తీసుకు వచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ అజయ్ కింద ఇజ్రాయెల్ నుంచి 230 మంది భారతీయులతో తొలి విమానం శుక్రవారం భారత్‌కు రానుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే శుక్రవారం ఈ తొలి విమానం భారత్‌కు చేరుకుంటుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి గురువారం తెలియజేశారు. గురువారం సాయంత్రం చార్టర్డ్ విమానం టెల్ అవీవ్‌కు చేరుకున్న తరువాత మొదటి బ్యాచ్ 230 మంది భారతీయులను తీసుకువస్తుందని చెప్పారు.
- Advertisement -