Friday, December 20, 2024

నవంబర్ 3న మొదటి రాష్ట్ర విద్యా సాధన సర్వే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం మొత్తం మీద 11 మిలియన్ విద్యార్థుల చదువుల తీరుతెన్నులను అంచనా వేయడానికి, వారి అభ్యాసం ప్రమాణాలను పెంపొందించడానికి ఉపయోగపడేలా నవంబర్ 3 న రాష్ట్ర విద్యాసాధన సర్వే చేపట్టనున్నారు. ఫెర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జి ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ (పిఎఆర్‌ఎకెహెచ్) అనే సంస్థ ఈ సర్వే నిర్వహిస్తుంది. 3,6,9 తరగతుల విద్యాభ్యాస ప్రమాణాలను మరింత విస్తరించడం కోసమే ఈ రాష్ట్ర విద్యాసాధన సర్వే చేపడుతున్నారు. విద్యార్థులు అభ్యాసం నుంచి సామర్థం సాధించడం వరకు క్రమేణా పురోగతి చెందాలన్న లక్షం తోనే ఈ సర్వే నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

విద్యార్థులు కేవలం నేర్చుకోవడమే కాకుండా ఏ విధంగా వారు తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని వినియోగిస్తారన్నది ముఖ్యమైన అంశంగా “పరాఖ్‌” అధినేత, సిఇఒ ఇంద్రాణీ భాదురీ వెల్లడించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి (ఎన్‌సిఇఆర్‌టి) లోని ఎన్‌ఎఎస్ విభాగానికి కూడా బాదురీ నేతృత్వం వహిస్తున్నారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి) ప్రకారం వివిధ రాష్ట్రాల విద్యాబోర్డుల్లోని వ్యత్యాసాలను నివారించడానికి పరాఖ్ కృషి చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News