- Advertisement -
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ అన్ని ప్రాంతాలలో చాప కింద నీరులా విస్తరించింది. కరోనా ధాటికి దేశంలో ప్రధాని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ తో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2.22 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 4454 మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం ఒక్క రోజే 3.02 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.67 కోట్లకు చేరుకోగా 3.03 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 2.37 కోట్ల మంది కోలుకోగా 27.2 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 19.6 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 32.9 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -