Monday, January 6, 2025

దేశంలో శతాధిక వయోవృద్ధ ఓటర్లు 2.49 లక్షలు : సీఈసీ రాజీవ్ కుమార్

- Advertisement -
- Advertisement -

 

పుణె : దేశంలో వందేళ్లు దాటిన శతాధిక వయోవృద్ధులు ఓటర్లుగా దాదాపు 2.49 లక్షల మంది వరకు ఉన్నారు. అలాగే 80 ఏళ్లు దాటిన ఓటర్లు 1.80 కోట్ల మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న వీరందరికీ చేరువైతే కొంత ఉపశమనం, పారవశ్యం కలుగుతుంది. ఎందుకంటే తామంతా బతికి ఉన్నంత కాలం ఓటు వేస్తామని చెప్పడమే స్ఫూర్తి కలిగిస్తుంది అని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం తన భావోద్వేగాలను వెల్లడించారు. ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించడానికి పుణెలో బుధవారం సైకిల్ ర్యాలీని ప్రారంభించిన తరువాత ఆయన మాట్లాడారు.

అర్బన్ ఏరియాల్లో ఓటర్ల జాబితాలను పెంచడమే ఈ అవగాహన ర్యాలీ లక్షం. భారత ఓటర్ల జాబితా బలీయం, చక్కదనం గురించి వివరిస్తూ అత్యున్నత హిమాలయ శిఖరాల నుంచి, దక్షిణాది కోస్తా తీరం 6000 కిమీ పొడవునా, పశ్చిమాన ఎడార్లు, తూర్పు ప్రాంతాల వరకు ఓటర్లు విస్తరించి ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 106 ఏళ్ల ఓటరు శ్యామ్ శరణ్ నేగీ తాను చనిపోయేనాటికి మూడు రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆసక్తిగా ఓటు వేయడం స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు.ఈ విధమైన స్ఫూర్తితో అర్బన్ ఏరియాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు నమోదు చేయించుకోవాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News