మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలలో విదేశాల నుంచి తరలిస్తున్న రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు పక్కా సమాచారం అందడంతో వేర్వేరు ఘటనల్లో విదేశాల నుంచి తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈక్రమంలో విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది ప్రయాణికుల కదలికలపై అనుమానంలో అధికారులు వారి బ్యాగులను తనిఖీ చేయగా ఈ గుట్టు బయటపడింది. సదరు ప్రయాణీకుల నుంచి 1.89 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలి షూలో దాచిన 514 గ్రాముల బంగారం, అలాగే మరు అనే ప్రయాణికుడి వద్ద 100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న కేసులో 10 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా బంగారం తరలిస్తూ పట్టుబడిన నిందితులపై గతంలో ఏమైనా కేసులున్నాయా ? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.
2.5 kg Gold Seized in Shamshabad Airport