Sunday, January 19, 2025

రైల్వేలో 2.74 లక్షల ఉద్యోగాలు ఖాళీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రైల్వేలో దాదాపు 2.74 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో 1.7 లక్షల ఉద్యోగాలు సేఫ్టీ కేటగిరికి చెందినవని సమాచార హక్కు కింద వెల్లడైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు ఉద్యమ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెలుగు లోకి వచ్చాయి. 2023 జులై 1 నాటికి నాన్ గెజిటెడ్ గ్రూప్ సి కింద 2.74, 580 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, వీటిలో సేఫ్టీ కేటగిరి కింద 1.77,924 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడైంది. 2022 డిసెంబర్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మొత్తం 3.12 లక్షల నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌కు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News