Sunday, February 23, 2025

దేశంలో కొత్తగా 2.82 లక్షల కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

2.82 Lakh corona positive cases in India

ఢిల్లీ: మూడో వేవ్‌లో కరోనా వైరస్ భారత్‌లో విలయతాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 24 గంటల్లో 2,82,970 మందికి కరోనా వైరస్ సోకగా 441 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 3.79 కోట్లకు చేరుకోగా 4,87,202 మంది దుర్మరణం చెందారు. ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8961కి చేరుకుంది. 3.55 కోట్ల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో 158 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News