Wednesday, January 22, 2025

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే ఇద్దరు నిందితులను ముంబైలోని జిటి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కాగా, ఏప్రిల్ 14వ తేదీ తెల్లవారుజామున బాద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి ఆవరణలో కాల్పులు జరిపి దుండగలు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి.. నిందుతల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిసిపుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News