Sunday, January 19, 2025

ఢిల్లీ మెట్రోస్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల రాతలు.. ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల రాతలు రాశారన్న నేరారోపణపై ఇద్దరిని ఢిల్లీ పోలీస్‌లు గురువారం అరెస్టు చేశారు. పంజాబ్‌లో వీరిని ఢిల్లీ పోలీస్‌స్పెషల్ సెల్ అరెస్టు చేసిందని పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా చెప్పారు. శివాజీపార్కు, మడిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్‌నగర్, మహారాజా సూరజ్‌మల్ స్టేడియం మెట్రో స్టేషన్ల గోడలపై “ఢిల్లీ బనేగా ఖలిస్థాన్, ఖలిస్థాన్ జిందాబాద్ ” అని ఆగస్టు 27న రాతలు రాసి ఉన్నాయి.

నాన్‌గ్లోయి ప్రభుత్వస్కూలు గోడలపై కూడా ఈ రాతలు కనిపించాయి. నిషేధిత సిఖ్స్ ఫర్‌జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) సంస్థ ఈ మేరకు వీడియో విడుదల చేసింది. “ ఢిల్లీలో సెప్టెంబర్ 10న జి20 సదస్సు జరిగే సమయంలో కెనడాలో ఖలిస్థాన్ రిఫెరెండమ్ నిర్వహిస్తామని ఎస్‌ఎఫ్‌జె అధికార ప్రతినిధి గుర్‌పట్వానీ సింగ్ పన్నూన్ వీడియోలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News