Thursday, January 23, 2025

ఏటా 2 బిలియన్ టన్నుల కార్బన్ డైయాక్సైడ్ తొలగింపు..

- Advertisement -
- Advertisement -

వాతావరణంలో అనేక మార్పులు వచ్చి కర్బన ఉద్గారాలు, హరితవాయువులు వెలువడి భూతాపం భరించలేని విధంగా తయారైతున్న సంగతి తెలిసిందే. ఈ భూతాపాన్ని ఎంత వేగంగా తగ్గించ గలిగితే అంత మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు పారిశ్రామిక యుగం కన్నా పూర్వపు స్థాయిల్లో ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు తీసుకురావాలని పారిస్ వాతావరణ సదస్సులో ప్రపంచ దేశాలు నిర్ణయించుకున్నాయి.

2050 నాటికి అత్యంత ఆధునిక సాంకేతిక ప్రక్రియల ద్వారా 1300 రెట్లు కన్నా ఎక్కువగా కార్బన్ డైయాక్సైడ్‌ను తొలగించడానికి తీర్మానించుకున్నాయి. అయితే చెట్లు వల్ల, నేల వల్ల కూడా హరిత వాయువులు రెట్టింపు స్థాయిలో తగ్గుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం నూతన సాంకేతికతకు భారీగా ఎంత ధనం వెచ్చించినా, చెట్ల వల్ల ఏటా వాతావరణం లోంచి రెండు బిలియన్ టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ తొలుగుతున్నట్టు తేలింది.

ఈ విధంగా ఎంత కార్బన్ డైయాక్సైడ్ తగ్గిపోయిందో అంచనావేయవలసి ఉంది. కార్బన్‌డైయాక్సైడ్‌ను అతిత్వరగా తొలగించే ప్రయత్నం వేగంగా అజెండాల ద్వారా కదులుతోంది. ఇంతవరకు ఆచరణాత్మకంగా భూసారాన్ని పెంపొందించడం, మొక్కల పెంపకం ద్వారానే కార్బన్‌డైయాక్సైడ్ నిర్మూలన జరుగుతోంది. నివేదిక ప్రకారం 2020 నుంచి 2022 వరకు ప్రపంచ దేశాలు కార్బన్‌డైయాక్సైడ్ నిర్మూలన కోసం 200 మిలియన్ డాలర్లను వెచ్చించాయి. 2010 నుంచి ప్రభుత్వాలు పరిశోధన అభివృద్ధి కోసం 4 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాయి. 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్షం ఉన్నా చాలా దేశాలు సరైన ప్రణాళికలు రూపొందించలేక పోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News