Wednesday, January 15, 2025

నార్సింగిలో దారుణం.. పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ శివారులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో పుప్పాల గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై మృతదేహాలను గుర్తించారు. గుట్టపై పతంగులు ఎగరవేసేందుకు వెళ్లిన కొంతమందికి మృతదేహాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

ఓ మహిళను బండరాళ్లతో కొట్టి అతి దారుణంగా హత్య చేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ చేరుకుని పరిశీలించారు. ఘటనాస్థలంలో మద్యం సీసాలను గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతర ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ జంట హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News