- Advertisement -
జిల్లాలోని కంజనాయక్‌పట్టి గ్రామంలో శుక్రవారం ఒక ఆలయం సమీపంలో ప్రమాదవశాత్తు బాణసంచా పేలిన ఘటనలో ఇద్దరు బాలురు సహా నలుగురు మృతి చెందనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పును పరిహారం ప్రకటించారు. ద్విచక్ర వాహనంలో ద్రౌపది అమ్మన్ గుడికి ఓ వేడుక సందర్భంగా గన్నీ బ్యాగులో టపాసుల బండల్స్ తీసుకెళుతుండగా శుక్రవారం రాత్రి 8.50కి అంటుకుని పేలుడు సంభవించింది. కంజనాయకన్‌పట్టీ గ్రామంలోని పూసరిపట్టి బస్ స్టాండ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో కొట్టమేడుకు చెందిన సెల్వరాజ్(29), గురువల్లియూర్‌కు చెందిన 11 ఏళ్ల ఇద్దరు బాలురు, లోకేశ్(20) ఉన్నారు.
- Advertisement -