Wednesday, January 22, 2025

విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి..

- Advertisement -
- Advertisement -

చెన్నూరు: చెన్నూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖాదర్‌ఖాన్‌ కొటాల్‌ గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి వివరాల మేరకు.. ఖాదర్‌ఖాన్‌ కొటాలకు చెందిన శశాంక్‌ (12), మనోజ్‌ (4) ఉదయం 10.30 గంటలకు తమ ఇంటి పైకప్పు ఎక్కి ఆడుకుంటున్నారు.

ఇంటి మిద్దెపైన సమీపంలో విద్యుత్‌ మెయిన్‌లైన్‌ తీగలను పొరపాటున పట్టుకుని విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. అపస్మాకర స్థితిలోకి వెళ్లిన చిన్నారులను స్థానికులు గుర్తించి చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అయితే, అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డిఎస్‌పి వెంకటశివారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News