Monday, December 23, 2024

బస్సులో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్: రాంచీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది.దీంతో బస్సులో నిద్రిస్తున్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

2 burnt alive after Bus Catches fire in Ranchi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News