Thursday, January 23, 2025

మూడు కంటైనర్ లారీలు ఢీకొని ఇద్దరు సజీవ దహనం..

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జాతీయ రహదారిపై మూడు కంటైనర్ లారీలు ఢీకొన్ని మంటలు ఎగసి పడడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ముంబై ఆగ్రా నాలుగు లేన్ల జాతీయ రహదారిలో గణేష్ ఘాట్ వద్ద శనివారం ఈ ప్రమాదం జరిగింది. ముంబై వైపు వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడు డివైడర్‌ను దాటి పక్కనున్న లేన్ లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో రెండు లారీలను అది ఢీకొట్టింది.

కార్లు, గ్రానైట్, ఇతర పార్సిల్ లోడ్ ఉన్న లారీలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ హైవేపై బోల్తా పడింది. దీంతో కొంతసేపు ఆ మార్గం మూసుకుపోయింది. రెండు లారీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలిపోయి, సజీవ దహనమయ్యారు. గాయపడిన వ్యక్తిని ధన్మోద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News