Tuesday, April 1, 2025

మక్తల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మక్తల్ మండలం జక్లేర్ గ్రామం దగ్గర రెండు కార్లు అదుపుతప్పి ఎదురెదురుగా ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జక్లేరు గ్రామ శివారులో మహారాష్ట్రకు చెందిన కారు, కర్ణాటకకు చెందిన మరో కారు రెండు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News