Tuesday, January 21, 2025

రెండు కార్లు ఢీ.. తల్లీకొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  జగ్గయ్యపేటలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో తల్లీకొడుకు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం గరికపాడు జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరణించిన వారు హైదరాబాద్ కేపీహెచ్‌బీ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News