Sunday, January 19, 2025

మంటల్లో చిక్కుకుని ఇద్దరు చిన్నారుల సజీవదహనం

- Advertisement -
- Advertisement -

కేంద్రపర(ఒడిశా): రాజ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బలరాంపూర్ గ్రామంలో గురువారం ఒక ఇంట్లో మంటలు వ్యాపించి ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఎల్‌పిజి సిటిండర్ లీకేజీ లేదా షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

సరుకులు కొనేందుకు తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న 11 ఏళ్ల అనుపమ సహాని, ఆమె తమ్ముడు 9 ఏళ్ల రిషి మంటల్లో చిక్కుకుని సజీవ దహనం చెంఇనట్లు పోలీసులు తెలిపారు. పిల్లలను కాపాడేందుకు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంటలను చల్లార్పిన అనంతరం ఇంట్లోకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News