Monday, December 30, 2024

నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లిః ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి దళితవాడకు చెందిన కోలా మహేష్, నాగమణి దంపతుల కుమారుడు సిద్ధార్థ (12), ఈసరం శ్రీను గంగా దంపతుల కుమారుడు వికాస్ (9) ఆదివారం ప్రమాదవశాత్తూ  నీట మునిగి మృతి చెందారు. వీరిద్దరూ గ్రామ శివారులోని ఒక పొలంలో ఉన్న నీటి కుంటలో బాతు పిల్లలను ఆడిస్తూ నీటిలో మునిగిపోయారని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకుని గ్రామస్థులు అక్కడికి వెళ్లేసరికి ఆ ఇద్దరు బాలురు మృతి చెందారని అన్నారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News