Monday, January 20, 2025

అభివృద్ధి పనులకు రూ.2 కోట్ల 64 లక్షల 25 మంజూరు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రతినిధి : కామారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధ్ది పనులకు 2 కోట్ల 64 లక్షల 25 వేల రూపాయలు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కామారెడ్డి నియోజకవర్గంలో మంజూరైన నిధుల వివరాలను వెళ్లడించారు. కామారెడ్డి నియోజకవర్గంలో 9 పల్లె దవాఖానల భవన నిర్మాణ పనులకు ఒక కోటి 80 లక్షలు, ఒక్కో సబ్ సెంటర్ నిర్మాణానికి 20 లక్షల చొప్పున మొత్తం 1.80 కోట్లు మంజూరైయ్యాయని తెలిపారు. 2006 లో మాజి మంత్రి షబ్బీర్ అలీ రాజకీయ కుట్రపూరితంగా కాచాపూర్ సింగిల్విండో ను బస్వాపూర్ సింగిల్విండో సొసైటీలో విలీనం చేయడం జరిగిందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా అగ్రికల్చర్ కో ఆపరేటివ్ జివో 265 ద్వారా కాచాపూర్ సింగిల్విండోను పాత పద్దతిన విభజించడం జరిగిందన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రామ్ నుండి 6 లక్షల 90 వేలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కుల సంఘాల భవన నిర్మాణలకు మంఊరైనట్లు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు,ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొంటుంన్నారని ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఎవరూ ఊహించని రీతిలో పండిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తునమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News