Monday, December 23, 2024

ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోయిరాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరన్‌సీనా వద్ద ఉన్న ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని కొండలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఇది దాదాపు 12.30 గంటలకు ప్రారంభమై దాదాపు 2.15 గంటల వరకు కొనసాగింది. ఉగ్రవాదులు బాంబులను కూడా విసిరారు. వాటిలో ఒకటి సిఆర్ పిఎఫ్ 128 బెటాలియన్ అవుట్‌పోస్ట్‌లో పేలింది అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మృతులను సీఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ సర్కార్, హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీగా గుర్తించారు. క్షతగాత్రులు ఇన్‌స్పెక్టర్ జాదవ్ దాస్, కానిస్టేబుల్ అఫ్తాబ్ దాస్ ను సమీప ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News