Wednesday, January 22, 2025

రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో గాలు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని ప్రజలకు కీలక సూచన చేసింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురిసింది. పలు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షం పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మాత్రం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల భాగ్యనగరం తడిసి ముద్దైంది. సిటీలోని రోడ్లన్నీ నీటితో మునిగిపోయాయి. అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి సిబ్బంది సహయక చర్యలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News