గుండ్లుపేట్(కర్నాటక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం వర్షం కారణంగా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కావలసిన పాదయాత్ర సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైనట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వర్షం వెలసిన వెంటనే తొండవాడి గేట్ నుంచి తన పాదయాత్ర ప్రారంభించిన రాహుల్ చామరాజ్‌నగర్ జిల్లాలోని గుండ్లుపేట్‌లోని కలలే గేట్‌కు చేరుకున్నారు. రాహుల్ వెంట వేలాదిమంది పాదయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటల వరకు విశ్రాంతి తీసుకున్న రాహుల్ తిరిగి తన యాత్రను ప్రారంభించి రాత్రికి మైసూరులోని తాండవపురలో నిద్ర బస చేస్తారని వర్గాలు తెలిపారు. శనివారం రాహుల్ పాదయాత్ర 23 కిలోమీటర్లు సాగింది. రాహుల్ వెంట కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయనకుమారుడు, ఎమ్మెల్యే యతీండ్ర సిద్దరామయ్య, పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, పార్టీ సీనియర్ నాయకుడు హెచ్‌సి మహదేవప్ప, ఎంబి పాటిల్, కెజె జార్జి, ప్రియాంక్ ఖర్గే యాత్రలో పాల్గొన్నారు. కర్నాటకలో రాహుల్ పాదయాత్ర 21 రోజులు ఉంటుంది. ఆయన రాష్ట్రంలో 511 కిలోమీటర్లు నడుస్తారు.
కర్నాటకలో 2వ రోజుల సాగిన రాహుల్ యాత్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -