Monday, December 23, 2024

సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలు.. ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మనీషా, శివాని అనే ఇద్దరు యువతులు నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో తమ ఫోటోలు అశ్లీలంగా పెట్టారని మనస్థాపానికి గురైన ఇద్దరు విద్యార్థినులు నిన్న(మంగళవారం) నల్గొండ రాజీవ్ పార్కులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

దీంతో ఇద్దరినీ చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఇద్దరు విద్యార్థినులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News