Tuesday, January 14, 2025

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి

- Advertisement -
- Advertisement -

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్స్ మృతిచెందారు. సోమవారం రాత్రి 11.30నిమిషాల సమయంలో హర్యానా సోనిపట్ జిల్లాలో కుందలి బార్డర్ సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావంతో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News