- Advertisement -
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని గణపురం మండలంలోని సింగరేణి క్వార్టర్స్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దావఖానకు తరలించారు. చనిపోయినవారిని భూపాలపల్లి మండలంలోని గొర్లవిడు తండాకు చెందిన భూక్య రాజేందర్(27), రామ్‌చరణ్(20)గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2 died in road accident in Bhupalpally
- Advertisement -