Thursday, April 3, 2025

జార్ఖండ్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీ

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు, నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. విద్యుత్తు సంస్థ అయిన ఎన్టీపిసి ఆ గూడ్స్ రైళ్లను ఆపరేట్ చేస్తోంది. కాగా బర్హయిత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగ్‌నదిహ్ సమీపంలో తెల్లవారు జామున 3 గంటలకు ఆ రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు రవాణా చేయడానికి ఎన్‌టిపిసి ఆ గూడ్స్ రైళ్లను వాడుతోంది. ఢీకొన్నప్పుడు ఆ రెండు రైళ్ల డ్రైవర్లు చనిపోయారని సాహెబ్‌గంజ్ సబ్‌డివిజన్ పోలీస్ అధికారి కిశోర్ తిర్కే పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఇదిలావుండగా ఎన్టీపిసి 140 టన్ను క్రేన్ కావాలని కోరిందని రైల్వే శాఖ తన ప్రకటనలో తెలిపింది. దానిని సాహిబ్‌గంజ్ నుంచి ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భారతీయ రైల్వేస్ ఎన్టీపిసికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు కూడా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News