Friday, April 4, 2025

ఆగివున్న లారీ ఢొకట్టిన మరో లారీ.. ఇద్దరు క్లీనర్లు మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివపేట మండలం నిజాంపూర్‌లోని ముంబయి హైవేపై సోమవారం ఉదయం ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News