Monday, December 23, 2024

గగనతలంలోనే యుద్ధ విమానాలు ఢీ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్ విమానాలు శనివారం కూలిపోయాయి. యుద్ద విమానాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అటు రాజస్థాన్‌లో ఓ యుద్ధ విమాన శకలాలు నేల రాలాయి. రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోయ్ 30 మిరాజ్ 2000 విమాపాలే కాసేపటికే కూలిపోయినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొరెనా ప్రాంతంలో విమాన శకలాలు పడినట్టు సమాచారం అందుకున్న పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొన్ని సహాయక చర్యలు చేపట్టారు. సుఖోయ్‌లో ఇద్దరు, మిరాజ్‌లో ఒక పైలట్ ఉన్నట్టు వాయుసేన అధికారులు తెలిపారు.

వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, మరో పైలట్ తీవ్రంగా గాయపడినట్టు వాయుసేన ట్విటర్‌లో పేర్కొంది. తీవ్రంగా గాయపడిన సదరు పైలట్ కన్నుమూసినట్టు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. మిగిలిన ఇద్దరు పైలట్లను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భారత వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. గాలిలో విమానాలు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందా? అనే దానిపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఘటనపై వాయుసేన చీఫ్ మార్షల్ వి. ఆర్. ఛౌదరీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదించారు.

పైలట్ల పరిస్థితి గురించి కేంద్ర మంత్రి ఆరా తీశారు. అటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అటు రాజస్థాన్ లోని భరత్‌పూర్‌లో ఓ విమాన శకలాలు నేల రాలాయి. తొలుత ఇది చార్టర్డ్ విమానం అని వార్తలు రాగా, తర్వాత అది వాయుసేనకు చెందిన యుద్ధ విమానంగా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విమాన శకలాలు మధ్యప్రదేశ్ నుంచి బయల్దేరి ప్రమాదానికి గురైన విమానాల్లో ఒక దానివా? లేదా మరో యుద్ధ విమానం కూలిందా? అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News