- Advertisement -
నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపధ్యంలో అధికారులు సాగర్ 2 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులోకి 60,948 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 67,865 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 311.1486 టీఎంసీలుగా ఉంది. సాగర్ జలాశయం అందాలను చూసేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు.
2 gates Opened at Nagarjuna Sagar Project
- Advertisement -