- Advertisement -
నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 67,546 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 59,264 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 16,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 311.74 టీఎంసీలుగా ఉంది. సాగర్ జలాశయం అందాలను చూసేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు.
2 gates Opened at Nagarjuna Sagar Project
- Advertisement -