Tuesday, December 17, 2024

మసీదులోకి చొరబడి జైశ్రీరాం నినాదాలు: ఇద్దరు యువకుల అరెస్టు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

దక్షిణ కన్నడ: కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక మసీదులోకి చొరబడి జై శ్రీరాం అంటూ నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆ ఇద్దరు యువకులను బిలినేలే సోద్లుకు చెందిన కీర్తన్, కైకంబ నెడ్‌తోటాకు చెందిన సచిన్‌గా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ 20వ దశకంలో ఉన్నారని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఆదివారం రాత్రి ఈ కడబ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగినట్లు ఆయన చెప్పారు. మోటారు సైకిల్ వచ్చిన ఇ ఇద్దరు యువకులు మసీదులోకి చొరబడి జైశ్రీరాం అంటూ నినాదాలు చే౯శారని, మసీదు సిబ్బంది బయటకు రావడంతోనే అక్కడి నుంచి పరారయ్యారని ఆయన చెప్పారు.

మసీదులోని సిసిటివి కెమెరా ద్వారా ఆ ఇద్దరు యువకులను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మసీదు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను వెతికి అరెస్టు చేసినట్లు ఆ అధికారి చెప్పారు. మసీదులోకి చొరబడిన ఇద్దరు యువకులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడంతోపాటు ముస్లింలు ఆ ప్రాంతంలో నివసించచకుండా చేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మసీదు సిబ్బంది పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News