- Advertisement -
డ్రాగన్ దేశం చైనాలో విజృంభిస్తున్న HMPV వైరల్.. భారత్ కు వ్యాపించింది. తాజాగా భారత్ లో HMPV వైరస్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ వైరస్ పట్లు ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విస్తృతంగా వైరస్ నిర్ధారణ టెస్టులు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో బెంగళూరులో 2 కేసులను గుర్తించారు. ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ గుర్తించింది.
కాగా, గత కొన్ని రోజులుగా HMPV వైరస్ చైనాను వణికిస్తోంది. అక్కడ భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్పత్రులు వైరస్ బాధితులతో నిండిపోతున్నాయి.
- Advertisement -