Thursday, March 6, 2025

యుఏఈలో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యూఏఈలో హత్యలకు పాల్పడ్డారంటూ ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసింది. మరణశిక్షకు గురైన వారు కేరళకు చెందిన మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు. ఓ యూఏఈ వాసి హత్య కేసులో మహమ్మద్‌రినాష్ దోషిగా తేలగా, ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో మురళీధరన్‌కు శిక్ష పడింది. వీరిద్దరికి అవసరమైన దౌత్య, న్యాయ సాయం అందజేసినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. యూఏఈ జైలులో భారతీయ మహిళ షెహజాది ఖాన్‌కు ఉరిశిక్ష అమలు చేసిన విషయం రెండురోజుల క్రితమే వెల్లడైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News