Monday, December 23, 2024

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

2 Injured in Road Accident in Peddapalli

పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి రాజీవ్ రహదారిపై ఎన్ టిపిసి సోలార్ ప్లాంట్ వద్ద ఆగి ఉన్న బూడిద లారీని వేగంగా దూసుకొచ్చిన మరో లారీ అదుపుతప్పి వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

2 Injured in Road Accident in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News