Monday, December 23, 2024

మేడారం జాతరకు బయల్దేరిన కుటుంబంలో తీవ్ర విషాదం..

- Advertisement -
- Advertisement -

మేడారం జాతరకు బయల్దేరిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వికారాబాద్ జిల్లా తొగరమామిడికి చెందిన రవి కుమార్ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు మేడారంకు పయనమయ్యాడు. అయితే ప్రయాణం మధ్యలోనే తన ఇద్దరు కూతుళ్లు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.

రవికుమార్, బాలీశ్వరీ దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు శౌర్య తేజ(4), తేజస్విని(2)లతో కలిసి మేడారం జాతరకు వేళ్లేందుకు శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి వరంగల్ కు వెళ్లారు. ప్రయాణంలో అలసిపోవడంతో వరంగల్ బాలాజీ నగర్ లోని బాలీశ్వరీ పుట్టింటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. వరుసటి రోజు ఉదయాన్నే మేడారంకు వెళ్లానకున్న వీరికి ఊహించని షాక్ తగిలింది. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు చిన్నారులు నీటి సంపులో పడి మరణించారు. దీంతో మేడారం వెళ్దామని వచ్చిన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News