Wednesday, January 22, 2025

గేదెలను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

2 Killed After Bike hit buffalo in Suryapet

సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం మండలంలోని తాడ్వాయి గ్రామంలో రోడ్డుకు అడ్డంగా వచ్చిన బర్రెలను వేగంగా దూసుకొచ్చిన బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారిని కలకోవకు చెందిన రఘు, నరహరిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

2 Killed After Bike hit buffalo in Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News