Wednesday, January 22, 2025

బీజేపీ అభ్యర్థి కరణ్ కాన్వాయ్ ఢీకొని ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

కైసర్‌గంజ్ ఎంపీ అభ్యర్థి , బీజేపీ నేత కరణ్ భూషణ్ సింగ్ కు చెందిన కాన్వాయ్‌గా ఆరోపిస్తున్న వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందగా, ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. కేర్నల్‌గంజ్ ఎస్‌హెచ్‌వొ నిర్బయ్ నారాయణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం రెహాన్ ఖాన్ (17), షాహెజాద్ ఖాన్ (20) మోటార్‌సైకిలుపై వెళ్తుండగా స్కూలు సమీపాన వారిని కాన్వాయ్ వాహనం ఢీకొనడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో రోడ్డు పక్క నుంచి వెళ్తున్న సీతాదేవి (60) ని కూడా వాహనం ఢీకొట్టింది. నిందితుడైన డ్రైవర్ లవ్‌కుష్ శ్రీవాస్తవ్ (30)ను అదుపు లోకి తీసుకున్నామని ఎఎస్‌పి రాధేవ్ శ్యామ్ రాయ్ చెప్పారు. కాన్వాయ్ వాహనంలో ప్రయాణిస్తున్న వారు దెబ్బతిన్న కారును విడిచిపెట్టి పరారయ్యారని స్థానికులు చెప్పారని ఎఎస్‌పి తెలిపారు. కాన్వాయ్ బీజేపీ అభ్యర్థి కరణ్ సింగ్‌దేనని స్థానికులు ఆరోపిస్తున్నారని ఎఎస్‌పి చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ ప్రమాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డును దిగ్బంధం చేశారు. ప్రమాదానికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీస్ అధికారులు దీనిపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళనకారులను శాంతింప చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News