Sunday, December 22, 2024

మెదక్ విషాదం.. ఇసుక దిబ్బలు కూలి ఇద్దరు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

2 Killed after struck in Sand Dunces in Medak

మెదక్: శివంపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం మండలంలోని గుండ్లపల్లి, దుబ్బలమాకు వాగులో ఇసుక తవ్వుతుండగా ఒక్కసారిగా ఇసుక దిబ్బలు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఇసుక దిబ్బలు కూలడంతో ఊపిరాడక అశోక్(32), మహేష్(20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2 Killed after struck in Sand Dunces in Medak

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News